28-09-2025 12:14:12 AM
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణ మున్సిపాలిటీలో నూతనంగా కేటాయించిన శానిటేషన్ టెండర్ ను రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు మున్సిపల్ డిఈకి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ... పట్టణ శానిటేషన్ టెండర్ దక్కించుకున్న శ్రీ సాయిరాం కన్స్ట్రక్షన్ సంస్థ గతంలో మున్సిపల్ పరిధిలోని నర్సరీ టెండర్ నిర్వహించి అందులో పనిచేస్తున్న కార్మికులకు గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా బిల్లులు రాలేదని మోసం చేస్తున్నారు. కార్మికుల వేతనాలకు సంబంధించి వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసిన సంస్థపై చర్యలు చేపట్టి శానిటేషన్ టెండర్ రద్దు చేసి మళ్ళీ టెండర్ పిలవాలని కోరారు. దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని నర్సరీ కార్మికులకు వేతనాలు చెల్లించాలన్నారు.