calender_icon.png 28 September, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో వికలాంగులకు సన్మానం

28-09-2025 12:10:46 AM

హాజరైన జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి

కోదాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోది జన్మదినాన్ని పురస్కరించుకొని, సేవా పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా శనివారం కోదాడ పట్టణంలో తేజ స్కూలులో  వికలాంగుల సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి హాజరై, దివ్యాంగులకు శాలువ కప్పి సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... మానవత్వం అంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడటమని, మోదీ ఎల్లప్పుడూ దివ్యాంగులను, వికలాంగులు అని కాకుండా, ప్రత్యేకమైన శక్తులు కలిగిన వారు అని గౌరవంగా ‘దివ్యాంగులు’ అని సంబోధిస్తారని అన్నారు.