calender_icon.png 26 September, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

26-09-2025 01:15:38 AM

-మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

-ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో వేడుకలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మహిళా ఉద్యోగులతో కలిసి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ ప్రకృతితో పెనవేసుకున్న ఒక ప్రత్యేకమైన పూల పండుగ అని మేయర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పండుగలో భాగంగా, బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళా ఉద్యోగులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అభినందించారు. వారికి మెమెం టోలు అందజేసి, ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.