18-10-2025 07:39:28 PM
పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో శనివారం బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపార సంస్థలు, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలను బీసీ సంఘాల నాయకులు బిఆర్ఎస్, బిజెపి, ఎమ్మార్పీఎస్ నాయకులు మూసి వేయించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే వరకు ఆందోళన చేపడతామని ఆయా పార్టీల నాయకులు బీసీ సంఘాల నేతలు అన్నారు. బంద్ కు సహకరించిన వ్యాపారులకు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి, బిఆర్ఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.