18-10-2025 07:37:44 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ జే. శ్రీనివాస్ రావును కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై గడ్డం ప్రవీణ్ శాలువాతో సత్కరించి సన్మానించారు. న్యాయమూర్తితో సంబంధాలను కొనసాగిస్తూ జిల్లాలో చట్టవ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు రాఘవయ్య, ఉమా పాల్గొన్నారు.