18-10-2025 03:22:40 PM
మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్
బిజినపల్లి: బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతంగా కొనసాగింది. మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్‌లో గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, టీఎస్ఎం ఉన్నత పాఠశాల, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బంద్‌కు మద్దతు తెలుపుతూ తరగతులకు హాజరు కాకుండా పాల్గొన్నారు.
గ్రామంలోని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపెట్టి పూర్తి సహకారం అందించడంతో బంద్ శాంతియుత వాతావరణంలో సజావుగా కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కార్యక్రమంలో అన్ని పార్టీ నాయకులు పాల్గొన్నారు. వీరిలో బీఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, బాలరాజు, జగదీష్, బాలస్వామి, ఖదీర్, రవీందర్ రెడ్డి, గోవిందు శ్రీను, అలాగే బీజేపీ నాయకులు ఆనంద్ సింగ్, జయప్రకాశ్, సొప్పరి శేఖర్, డి. వెంకటేష్ తదితరులు పాల్గొని బీసీ బంద్‌ను విజయవంతం చేశారు.