16-10-2025 02:31:11 AM
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తిగా, క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న నేతగా గుర్తింపు
పార్టీ మనుగడ లేని పరిస్థితిలో కూడా తన తల్లిని కౌన్సిలర్‌గా గెలిపించి సంచలనం.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు అత్యంత దగ్గరి అనుచరుడిగా గుర్తింపు,
మృదు స్వభావి, సమాజ సేవకుడిగా సంఘ స్వామి యాదవ్ ప్రజలకు విశిష్ట సేవలు
సమరంతవంతమైన నాయకుడిగా సంఘ స్వామి యాదవ్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని జిల్లాలో చర్చ
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం కోసం పోటీలో ఉన్న ముఖ్యమైన నాయకులలో బీసీ వర్గానికి చెందిన సంఘ స్వామి యాదవ్ కీలకంగా మారనున్నారు. పార్టీ కో సం అహర్నిశలు శ్రమించే వ్యక్తిగా, క్షేత్ర స్థా యిలో బలమైన పట్టున్న నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నేడు బుధవారం సిరిసిల్లలో రాష్ట్ర పిసిసి పరిశీలకుడు చిట్ల స త్యనారాయణకు తన నామినేషన్ పత్రాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలసి అందించారు.
వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజు పల్లికి చెందిన సంఘ స్వామి యా దవ్ గతంలో ఎంపీటీసీగా ప్రజలకు విశేష సేవలు అందించారు. సామాన్య ప్రజలతో ఆయనకున్న అనుబంధం, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో చూపిన నిబద్ధత ఆయన పట్ల పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో గౌరవా న్ని పెంచింది. ముఖ్యంగా, గత మున్సిపల్ ఎన్నికలు ఆయన రాజకీయ చతురతను ని రూపించింది.
అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ తన తల్లిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక కౌన్సిలర్గా గెలిపించడం ద్వారా స్వామి యాదవ్ తన పోరాట స్ఫూర్తిని, ఎన్నికల వ్యూహాన్ని చాటారు.సంఘ స్వామి యాదవ్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయిన ఆది శ్రీనివాస్కు అత్యంత దగ్గరి అనుచరుడిగా గుర్తింపు వుంది. ఈ అనుబంధం పార్టీలో ఆయన బలాన్ని మరింత పెంచే విధంగా వుంది.
జిల్లా అధ్యక్ష పీఠం కనుక దక్కితే, పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని, రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కష్టపడతానని సంఘ స్వామి యాదవ్ హామీ ఇస్తున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కుటుంబంలో భాగంగా చూసి, వారిలో సోదర భావాన్ని పెంపొందించడమే తన ప్రథమ లక్ష్యంగా ఆయన పే ర్కొన్నారు.సమాజ సేవకుడిగా మరియు మృదుస్వభావిగా పేరున్న సంఘ స్వామి యాదవ్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీని మ రింత బలోపేతం చేస్తుందని జిల్లా నేతలు, కా ర్యకర్తలు బలంగా విశ్వసిస్తున్నారు.
బీసీ వర్గానికి చెందిన సమర్థవంతమైన నాయకుడికి అధ్యక్ష పీఠం అప్పగిస్తే, పార్టీకి కొత్త ఊపు వస్తుందని, అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకోవడంలో ఇది కీలకమవుతుందని వారు ఆకాంక్షిస్తున్నారు. కార్యకర్తలను కలుపుకుని పోయే గుణం, గెలుపు బాటలో నడిపించగల సమర్థత ఉన్న నేతగా సంఘ స్వామి యాదవ్ పేరు ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.