05-11-2025 12:05:56 AM
రంగారెడ్డి డీఆర్వోకు బీసీ నాయకుల వినతి పత్రం
ఎల్బీనగర్, నవంబర్ 4 : బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్ లో చేర్చాలని బీసీ సంఘాల నాయకులు మంగళవారం రంగారెడ్డి డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపుమేరకు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా అదనపు మెజిస్ట్రేట్ టీఎల్ సంగీత కు 42శాతం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ పలువురు బీసీ ఉద్యమ నేతలు వినతి పత్రం అందజేశారు.
బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్ చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించి అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీసీ రిజర్వేషన్లపై కపట నాటకాలు ఆడకుండా చిత్తశుద్ధితో వ్యవహారించాలని కోరారు. వినతిపత్రం అందజేసినవారిలో బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షుడు బొమ్మ రఘురామ్ నేత, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక సభ్యులు చామకూర రాజు, కేవీ గౌడ్, పెద్ది జగదీష్ నేత, వీవర్స్ డే ఫౌండర్ ఎరమాద వెంకన్న నేత, ఉపేంద్ర యాదవ్, కొండల్ గౌడ్. లింగేష్ యాదవ్, రాయబండి పాండురంగాచారి, తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు గోర శ్యామ్సుందర్ గౌడ్, కొండా లక్ష్మణ్ బాపూజీ గ్లోబల్ ఫౌండేషన్ అధ్యక్షుడు జిల్లా రాపోలు జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు.