calender_icon.png 5 November, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళానైపుణ్యాల ప్రదర్శనకు చక్కటి వేదిక

05-11-2025 12:06:36 AM

జిల్లా కలెక్టర్ రిజ్వాన్  బాషా షేక్ 

జనగామ, నవంబర్ 4 (విజయక్రాంతి): మంగళవారం  జిల్లా యువజన ఉత్సవాలను స్థానిక జూబ్లీ ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ... యువత సాంస్కృతిక కళా రంగాలలోని అవకాశాలను పూర్తిగా వినియోగించు కోవాలని కోరారు. దీనివలన భవిష్యత్తులో ప్రతి చోట ఉద్యోగ అవకాశాలలోనూ సాఫ్ట్వేర్ రంగంలోనూ వీరికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలోను ప్రత్యేక అం శంగా వీటిని తీసుకుంటారని విద్యార్థులు యువత గమనించాలని కోరినారు. ప్రతి అంశంలోనూ పాల్గొని తమ  ప్రతిభను నిరూపించుకోవాలన్నారు. కళలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించినారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని మన జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి లోనూ జాతీయస్థాయిలోనూ ప్రతిభ కనబరచాలన్నారు.

ఇటువంటి పోటీలను యువత ఉపయోగిం చుకొని  జిల్లా స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ యువజన ఉత్సవాలలో ప్రతిభ నైపుణ్యము కనబరిచి ఉత్సాహంగా పాల్గొనాలన్నారు.

ఈ పోటీలలో జానపద గేయాలు జానపద నృత్యాలు, కథారచన ఉపన్యాసం, కవిత్వము, సైన్స్ మేళ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో  జిల్లా యువజన క్రీడల అధికారి  కోదండరాములు, జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్, యువత  పాల్గొన్నారు.