calender_icon.png 11 August, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి

10-08-2025 11:25:43 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షంతో కలిసి పోరాడాలని మండల సిపిఎం కార్యదర్శి షేక్ యాకుబ్ కోరారు. మండలంలోని అబ్బిరెడ్డిగూడెం గ్రామంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు.రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టబద్ధత కోసం ప్రభుత్వం ఒంటరిగా కాకుండా అఖిలపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయాలని కోరారు.

రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు మాటలు చెప్పకుండా బీసీ బిల్లు చట్టబద్ధత కోసం కలిసి ఉద్యమించాలని ఆయన కోరారు.రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని సిపిఎం పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు. దీని కోసం అన్ని రాజకీయ పక్షాల మద్దతును పొందాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మాయమాటలు చెప్పి బీసీలను మోసం చేస్తుందని విమర్శించారు. మోడీ చాయ్ వాలా అని చెప్పుకుంటూ బీసీలను నయవంచన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.