11-08-2025 12:00:00 AM
వలిగొండ,ఆగస్టు 10 (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఎండి అప్రోజ్, మాజీ జెడ్పిటిసి మొగుళ్ల శ్రీనివాస్ కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తిచేయడం జరిగిందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ సత్తా చాటుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేశిరెడ్డి జనార్దన్ రెడ్డి, కాసుల కృష్ణ, కొంతం శ్రీను, ఐటిపాముల సత్యనారాయణ, పబ్బు వెంకటరమణ, పల్సం రాజు, కళ్లెం మారయ్య తదితరులు పాల్గొన్నారు.