calender_icon.png 12 October, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లను అడ్డుకోవడంపై భగ్గుమన్న బీసీలు

11-10-2025 01:12:22 AM

ఆదిలాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయడంలో హైకోర్టు స్టే విధించడంతో రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరసిస్తూ, రిజర్వేషన్లను అడ్డుకుంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన వారికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ వర్గాలు నిరసనకు దిగాయి. శుక్రవారం జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో బీసీలు పెద్ద ఎత్తున రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దగ్దం తో ఆందోళనలు చేపట్టారు.

బీసీ రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తు హైకోర్టులో పిటిషన్ వేసిన వారి దిష్టిబొమ్మతో జిల్లా కేంద్రంలో బీసీ లు ప్రదర్శన నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘ భవనం నుంచి ప్రారంభమైన ప్రదర్శన తెలంగాణ తల్లి చౌక్ కు చేరుకుంది. పాత జాతీయ రహదారి పై  దిష్టిబొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రహదారిపై బైటాయించి నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు తెలంగాణ వచ్చిన తరువాత బీసీలు పదేండ్లు వెనకబడ్డారని అన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం జాతీయ అధ్యక్షుడు జజుల శ్రీనివాస్ గౌడ్ పోరాడుతున్నారని తెలిపారు.

టిషన్ల వెనక ఎవరు ఉన్నారో బీసీలకు తెలుసని తగిన సమయంలో వారికి గుణపాఠం తప్పదన్నారు. రాష్ట్రంలో బీసీ నినాదం గట్టిగా ఉందని, జాతీయ నాయకత్వం పిలుపు మేరకు ఆందోళనలు ఉదృ తం చేస్తామన్నారు.   ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, నాయకులు అంజూ, శ్రీనివాస్, అశోక్, రాము, చందు,  ప్రశాంత్ ఉన్నారు.