20-10-2025 01:55:17 AM
బీసీ రిజర్వేషన్ల సాధన సమితి కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్
ముషీరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ‘ఛలో హైదరాబాద్‘ మహాధర్నా కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపునిచ్చింది.
ఆదివారం చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు, సాధన సమితి కన్వీనర్ బాలగోని బాలరాజ్ గౌడ్, డాక్టర్ విశారదన్ మహారాజ్, అయిలి వెంకన్న గౌడ్, యెలికట్టే విజయ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్లు మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ల పట్ల బిజేపీ కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశా రు. శీతాకాలం పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించడంతోపాటు 9వ షెడ్యూల్డ్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. మహాధర్నాలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉగ్యోగులు, విద్యార్థులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.