calender_icon.png 20 October, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయంలో శృంగేరి పీఠాధిపతి

20-10-2025 01:55:33 AM

  1. శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు 
  2. స్వాగతం పలికిన మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ధర్మ విజయ యాత్రలో భాగంగా  శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ఆదివారం వేములవాడను సందర్శించారు. ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆచారం ప్రకారం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాజన్నకు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహా స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటిలింగాల దర్శనం చేసుకున్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి మ్యాప్లు పరిశీలించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ ఎం హరిత, ఎస్పీ మహేష్ బి గితే, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,ఆ లయ ఈవో రమాదేవి, వేముల వాడ ఆర్డీవో రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్,  తహసీల్దార్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.