calender_icon.png 21 November, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు జనాభా ప్రతిపాదికన వాటా కల్పించాలి

16-08-2024 02:22:42 AM

కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): బీసీలకు జనాభా ప్రతిపాదికన అన్ని రంగాల్లో వాటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గురువారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఒక వేళ ఇచ్చిన మాట నేరవేర్చనట్లయితే ప్రజా వ్యతిరేకత వస్తుందని తెలిపారు.రాబోయే కాలంలో ప్రతి మండలంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదర్శన్ నేత, రాష్ట్ర కార్యదర్శి బాస్కరచారి, నాయకులు పరశురాం, చింతల శంకర్, మంజుల, బిట్ల సురేందర్, రాజేందర్, మచ్చేందర్, లక్ష్మణ్ యాదవ్, లక్ష్మణ్ గౌడ్, సతీష్, కుర్మ సాయిబాబా, ఇర్ఫాన్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.