calender_icon.png 5 July, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనాభా ప్రకారం బీసీలకు పదవులివ్వాలి

05-07-2025 02:06:48 AM

  1.   42 శాతం రిజర్వేషన్ల పెంపుపై కేంద్రంతో పోరాడాలి
  2. రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
  3. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జనాభా ప్రకారం నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ కీలక పదవులను కేటాయించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. శుక్రవారం జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలోని బీసీ సంఘం నాయకులు గాంధీభవన్‌లో మల్లిఖార్జున ఖర్గేను కలిశారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ కేంద్రానికి పంపించిన బిల్లుపై జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి కేంద్రం ఆమోందించేలా కృషి చేయాలని కోరారు. బీసీలకు డిప్యూటీ సీఎం పదవితోపాటు మంత్రివర్గంలోకి మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. సీఎం నేతృత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలవాలని చెప్పారు. బీసీలకు సంబంధించిన విజ్ఞప్తిపై మల్లిఖార్జున ఖర్గే సానుకూలంగా స్పందించారని జాజుల పేర్కొన్నారు.