calender_icon.png 19 July, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తంగా ఉండండి

19-07-2025 01:55:43 AM

 కాప్రా, జులై 18 : శుక్రవారం మధ్యాహ్నం నుండి కురుస్తున్న భారీ వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమి టీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. వర్షా నికి తోడు ఏర్పడే పరిస్థితుల్లో ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాం తాలకు వెళ్లకూడదని, పాత భవనాల కింద నిల్చొనరాదని హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతే తనకు అత్యంత ప్రాముఖ్యమని తెలిపారు. అవసరమైతే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలనీ, ఎలాంటి సహాయం అవసరమైనా నిబంధనల ప్రకారం స్పందించేందుకు అధికారులు సిద్ధం గా ఉన్నారని వెల్లడించారు. ఫోన్ +91 40 2956 5758, +91 90001 136 67 నంబర్లకు సంప్రదించాలన్నారు.