calender_icon.png 19 July, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ డీసీసీబీ సమావేశం

19-07-2025 01:57:21 AM

చైర్మన్ సత్తయ్య అధ్యక్షతన నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 18 (విజయక్రాంతి)/నాంపల్లి: హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ పాలకవర్గ సమావేశం శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహిం చారు. ఈ సమావేశానికి డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షత వహించారు. సమావేశంలో బ్యాంక్ పనితీరు, అభివృద్ధి ప్రణాళికలు, డిపాజిట్ల వృద్ధి వంటి కీలక అంశాలపై చర్చింది, పలు తీర్మానాలు చేశా రు.

ఈ సందర్భంగా నాబార్డ్ 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాక్స్ సహకా రంతో గోడౌన్ల నిర్మాణం, గ్రామీణ రుణాల విస్తరణ, 12.9 శాతం డిపాజిట్ పెరుగుదల లాంటి కీలక రంగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు, హెచ్‌డీసీసీబీని ఉత్తమ పురస్కారంతో సత్కరించారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్లు సభ్యులు అంజిరెడ్డి, చంద్రశేఖర్, బాల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కిషన్‌నాయక్, లక్ష్మారెడ్డి, పోలీస్ రాంరెడ్డి, ఆనంద్, శ్యామ్ సుందర్‌రెడ్డి, మొగులయ్య, మోహన్‌రావు, పీజీవీ రాణి పాల్గొన్నారు. బ్యాంక్ సీఈఓ భాస్కర సుబ్రహ్మణ్యం, జీఎం ప్రభాకర్‌రెడ్డి, జీఎం ఫణి శ్రీరాం, డీజీఎం కిరణ్, ఏజీఎం రమాదేవి, ప్రొఫెషనల్ డైరెక్టర్ గిరిధర్, వికారాబాద్ జిల్లా డీసీవో, నాబార్డ్   ప్రతినిధులు హాజరయ్యారు.