18-08-2025 12:00:00 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
టేక్మాల్, ఆగస్టు 17 : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం టేక్మాల్ మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి కలి వాగు, పెద్ద చెరువు అలుగు పొంగిపొర్లుతూ టేక్మాల్ - ధన్నూర రోడ్డు వరద ప్రవాహానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయని, వాగుల్లో ఉదృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు రాకపోకలు ఇబ్బంది కాకుండా చూస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట టేక్మాల్ తహసిల్దార్ తులసీరామ్, ఆర్‌అండ్ బి సర్దార్ సింగ్, ఈఈ ఇరిగేషన్ శ్రీనివాసులు, సంబంధిత పంచాయతీ సెక్రటరీలు, సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు.