18-08-2025 12:00:00 AM
ములకలపల్లి, ఆగస్టు 17,( విజయ క్రాంతి):గత వారం రోజులుగా ఎడతెరిపి లే కుండా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలు నిండా యి. జలకళను సంతరించుకొని నీటితో కళకళలాడు తున్నాయి.
మండలంలో ఉన్న మూక మామిడి మధ్యతరహా సాగునీటి ప్రా జెక్టు, పూసుగూడెం, ములకలపల్లి, చాపరాల పల్లి, పొగళ్లపల్లి, తిమ్మంపేట, జగన్నాధపు రం ఉమ్మడి పంచాయితీల్లోని చెరువుల కుం టలు అలుగులు పారు తున్నాయి. దంచి కొ ట్టిన వానతో నీటి వనరులన్నీ నీటితో నిం డుగా కళకళలాడుతుండడంతో రైతులు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి వనరుల కింద పొలాల్లో రైతులు ముమ్మరంగా వరి నాట్లు చేస్తున్నారు.
మండలంలోని మొర్రే డు, పాములేరు, సాకివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రెవెన్యూ, వ్యవసాయ శా ఖ, పోలీసు అధికారులు సిబ్బంది పర్యటిస్తూ ప్రజలకు, రైతులకు ఎటువంటి అంతరా యం, నష్టం కలగకుండా తీసుకోవాల్సిన చ ర్యలపై అప్రమత్తం చేస్తూ సలహాలు సూచనలు అందిస్తున్నారు. చెరువులు, కుంటలు, మూక మామిడి ప్రాజెక్టు నిండటంతో వీటి కింద సాగు చేస్తున్న ఆయకట్టు దారులు పం టలకు డోకా లేదని తెలిపారు.