calender_icon.png 26 September, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతరం అప్రమత్తంగా ఉండండి

26-09-2025 12:03:18 AM

వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి)ః రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ నివేదిక నేపథ్యంలో అన్ని శాఖలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్రమత్తం చేశారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకా శం ఉందని, నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హైఅలర్ట్‌గా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీ క్షించాలన్నారు.

అవసరమైతే లోతట్టు ప్రాం తాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయిం చి, పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.   వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని  సూచించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హైడ్రాతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృం దాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.