26-09-2025 12:04:15 AM
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, సెప్టెంబర్ 25 : గ్రామాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, నాంచేరిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, ఇంద్రారెడ్డినగర్లో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, కిష్టాపూర్లో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, ఆలూర్లో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, రూ.10 లక్షలతో స్టీట్ లైట్స్, తల్లారంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్,
తంగడిపల్లిలో రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, మడికుట్టులో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, కౌకుంట్ల్లలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, అంతారంలో రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, రూ.10 లక్షలతో స్టీట్ లైట్స్, బస్తేపూర్లో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, న్యాలటలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్, కమ్మెటలో రూ.60 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్,
గొల్లగూడలో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో స్టీట్ లైట్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా నిధులు మంజూరు చేస్తూ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్లు, అండర్ గ్రౌండ్ గైనేజీ వ్యవస్థ, స్టీట్ లైట్స్ ఏర్పాట్లకు అధిక నిధులు మంజూరు చేసి గ్రామాల్లో సమస్యలు లేకుండా చూస్తున్నామన్నారు.
మాజీ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, ముడిమ్యాల్, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్లు గోనె ప్రతాప్రెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్లు బండారు శైజాఆగిరెడ్డి, రాజశేఖర్, గోపాల్రెడ్డి, అంతారం మాజీ ఎంపీటీసీ కావలిసుజాత వెంకటేశ్బాబు, కాంగ్రెస్ మండల, మున్సిపల్ అధ్యక్షులు ఆలంపల్లి వీరేందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.