calender_icon.png 4 October, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి

04-10-2025 12:03:53 AM

  1. జిల్లా ఎస్పీ మహాజన్
  2. బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ

ఆదిలాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలన, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. బజార్హత్నూర్ మండ లం పోలీస్ స్టేషన్ శుక్రవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  పోలీ స్ స్టేషన్‌లో ఉన్న వాహనాలను పరిశీలించి వాటి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీ లించి, కేసులో దర్యాప్తు, నేర పరిశోధన పై పురోగతి సాధించాలని, నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా నివేదికలను పూర్తి చేయాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ నిర్వహణలో 5 S విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రానున్నది ఎన్నికల సమయం ప్రతి గ్రామాన వీపీఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేసి, సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకొని, ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ క్రైమ్, డిజిటల్ ఫ్రాడ్, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వాటి వల్ల కలుగు అనర్ధాల పై  పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. యువత, మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు చెడు వ్యసనాల బారిన పడకుండా, చదువు పై ఉన్న ఆవశ్యకతను తెలియజేసే ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రోత్సహించాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, బోథ్ సీఐ వెంకటేశ్వరరావు,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.