04-10-2025 12:02:30 AM
-11 నెలలుగా అద్దే వాహనాలకు బిల్లులు చెల్లించని వైద్యశాఖ
-జిల్లా వైద్యాధికారి వాహనానికి మాత్రం బిల్లు చెల్లింపు
-బిల్లుల చెల్లింపులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అకౌంటెంట్
-జిల్లా వైద్యాధికారి కనుసన్నల్లో అకౌంటెంట్
-బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న అద్దె వాహనదారులు
కామారెడ్డి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): వైద్యశాఖలో అధికారుల కోసం ఏర్పాటు చేసిన అద్దె వాహనాలకు బిల్లులు చెల్లించడంలో వైద్యశాఖ అకౌంటెంట్ ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారని అద్దె వాహనాల యజమానులు ఆరోపిస్తున్నారు. 11 నెలలుగా అద్దె వాహనదారులకు అద్దె చెల్లించడం లేదని అద్దె వాహనదారులు పేర్కొ న్నారు. కామారెడ్డి జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి సొంతవా హనానికి మార్చి 2025 వరకు అకౌంటెంట్ బిల్లు చెల్లించారని అద్దె వాహనదారులు ఆరోపిస్తున్నారు.
నిరుద్యోగుల మైన తమకు వాహనాలను అద్దెకు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుం టున్నామని అలాంటి తమకు 11 నెల లుగా వాహనాల బిల్లు చెల్లించడం లేదని తెలిపారు. అకౌంటెంట్ రాజు తమ ఇష్టానుసారంగా బిల్లులు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా దొనకంటి కుమార్ అద్దె వాహనాన్ని ఏర్పాటు చేయగా 11 నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదని విజయక్రాంతి ప్రతినిధితో తన ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లా వైద్యశాఖ అధికారి సొంతవాహనానికి మాత్రం బిల్లు మార్చి వరకు చెల్లించాలని తమకు మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ చర్యలు తీసుకొని తమకు రావాల్సిన పెండిం గ్ బిల్లులను ఇప్పించాలని కోరుతున్నారు. అకౌంటెంట్ కు ఎంతో కొంత డబ్బులు ముట్ట చెబితేనే బిల్లులు ఇస్తున్నారని లేకుంటే ఇబ్బందులు చేస్తున్నానని పలువురు అద్దె వాహనదారు లు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య శాఖ అధికారి చంద్రశేఖర్ బిల్లుల చెల్లింపు లో నిర్లక్ష్యం చేస్తున్నారని అద్దే వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ఒక్కరికి 3.63 లక్షల బిల్లులు రావాల్సి ఉన్నాయని బిల్లులు ఇవ్వమంటే ఇవ్వడం లేదని పలువురు పేర్కొన్నారు. మూడుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఏదో ఒక సాకు చెబుతూ బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమకు రావలసిన బిల్లులు వైద్యశాఖ నుంచి ఇప్పించాలని అద్దె వాహనదారులు కోరుతున్నారు.