04-10-2025 01:36:30 AM
- సంగారెడ్డిలో జగ్గారెడ్డి నేతృత్వంలో వేడుకలు
- మెదక్లో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు
సంగారెడ్డి/ జహీరాబాద్/పాపన్నపేట/ కొండాపూర్/ చేగుంట/మెదక్, అక్టోబర్ 3 (విజయక్రాంతి):సంగారెడ్డి, మెదక్ జిల్లాలో దసరా పండగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేవీ నవరాత్రుల సంద ర్భంగా వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే దసరా రోజున శమీపూజ, ఆ యుధ, వాహన పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన దసరా ముగింపు ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాటలు పాడి ప్రజలను ఉర్రూతలూగించారు. జహీరాబాద్లోని కైలాసగిరి శివాలయం ఆవరణలో ఆర్యవైశ్య యువజన సంగం ఆధ్వర్యంలో రావణాసుర దహనం అలరించింది.
కొండాపూర్ మండల పరిధిలోని అనంతసాగర్ లో ఏర్పాటుచేసిన దుర్గా భవాని మాత విగ్రహాల ఊరేగింపు ఉత్సవం కోలాటాలు నృత్యాలు చేస్తూ గ్రామంలోని ప్రధాన సెంటర్లో మీదుగా ఊ రేగింపుగా అమ్మవారిని అనంతసాగర్ చెరువులో రాత్రి నిమజ్జనం చేశారు. జహీరాబా ద్లో ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావుకు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ తో పాటు వివిధ గ్రామాల నాయకులు ఎమ్మెల్యే కాంపు కా ర్యాలయం వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఝరాసంగం, జహీరాబాద్, న్యాల్కల్, మొగుడంపల్లి, కోహిర్ మండలాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. అలాగే జిల్లాలోని ఆయా మండలాల్లో ఘనంగా దసరా సంబరాలు జరుపుకున్నారు.
మెదక్ జిల్లాలో...
మెదక్ జిల్లాలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో ప్రజలంతా జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించి జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే చేగుంట మండలంలో నకిరేకల్ పట్టణంలోని రామలింగేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గమ్మ ఆలయాలను నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం కుటుంబ సమేతంగా సందర్శించి పటేల్ నగర్ లో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాపన్నపేట మండల పరిధిలోని గ్రామాల్లో దుర్గమ్మ నిమజ్జన శోభాయాత్రలు కన్నుల పండువగా నిర్వహించారు. డీజే చప్పుళ్ల మధ్య యువకుల నృత్యాలతో సందడి వాతావరణం నెలకొంది. వెళ్లిరావమ్మా దుర్గమ్మ తల్లి అంటూ సాగనంపారు.