calender_icon.png 11 September, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

11-09-2025 12:31:11 AM

- చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు

- మత్తుతో చేసుకోకండి మీ జీవితం చిత్తు

- అవగాహన సదస్సులో ఇల్లందు డీఎస్పీ ఎన్ చంద్రబాను

ఇల్లందు టౌన్, సెప్టెంబర్10, (విజయక్రాంతి):పట్టణంలో స్థానిక సాహితి జూనియ ర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ గంజాయి ఇతర మత్తు పదార్థాల గు రించి, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి పోలీస్ అధికారులు అవగాహ న కల్పించారు. ఈ కార్యక్రమానికి డిఎస్పి చంద్ర భాను పాల్గొని మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల మీరు మీ కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదన్నారు.

ప్రతి విద్యార్థి చదువు పై దృష్టి సారించాలని చదువు కోవడం ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతా లలో విద్యను అభ్యసించే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి మంచి ఉద్యోగ అవకాశాలు అంది పోచుకోవడం జరుగుతుంద న్నారు. చెడు వ్యసనాలకు అలవాట్లకు దూ రంగా ఉండాలని డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ సరఫరా చే సిన విక్రయించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

గంజాయి డ్రగ్స్ ఇతర పదార్థాలకు దూరంగా ఉండాలని చదువుపై దృష్టి సారించి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగుతూ బంగారు భ విష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలిపారు. మత్తు పదార్థాలు వాడటం వల్ల ఆరోగ్యంపై, కుటుంబంపై, సామాజిక జీవితంపై, ఆర్థిక పరిస్థితులపై భారీ నష్టాలు జరిగే అవకాశం ఉందన్నారు.

డ్రగ్స్ మూలంగా సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలను వివరిస్తూ మాధకద్రవ్యాలను తరిమి కొట్టడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరి గిందని, యువత కూడా మాధకద్రవ్యాలకు దూరంగా ఉంటూ మాధకద్రవ్యాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని యువతకు పిలుపునిచ్చారు. అదేవిధంగా వి ద్యార్థి దశలో ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు ని బంధనలు నేర్చుకోవడం చాలా ముఖ్యమని మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎ క్కువగా జరుగుతున్నాయని నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ ధ రించాలి అధిక వేగాన్ని నియంత్రించడానికి స్పీడ్ లేజర్ గన్ ద్వారా కేసులు నమోదు చే యడం జరుగుతుందన్నారు.

మైనర్లు ఎట్టి ప రిస్థితుల్లో వాహనాలు నడపవద్దని తల్లిదండ్రులు కూడా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని కోరారు. ప్రతి ఒక్కరూ రోడ్డు దాటేటప్పుడు రోడ్డుపై నడిచేటప్పుడు ట్రాఫి క్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాలేజీ యజమాన్యంతో పాటు ఇల్లందు ఎస్హెచ్‌ఓపి సురేష్, తదితరులు పాల్గొన్నారు.