calender_icon.png 30 September, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

30-09-2025 12:21:27 AM

చారకొండ సెప్టెంబర్ 29: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంచార్జి డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. గ్రామాల్లో సిజనల్ వ్యాధులు ప్రబలకుండా ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించాలన్నారు.

గ్రామాల్లో పారిశుద్ద పనులు, దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సిజనల్ వ్యాధులు దరిచేరవన్నారు. డాక్టర్ సృజన, సీహెచ్త్వో బాల్రాం, హెచ్‌ఐవో ఎన్టీవీ చారి, హెల్త్ అసిస్టెంట్ శక్రు, ఏఎన్‌ఎంలు అలివేలు, కల్పన, కళమ్మ, సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.