calender_icon.png 30 September, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిష్కారమే పోలీసుల ప్రథమ కర్తవ్యం ప్రజావాణి

30-09-2025 12:22:50 AM

జిల్లా ఎస్పీ డి జానకి

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ప్రజల సమస్యలు పరిష్కరించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాల యంలో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. జానకి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

ప్రజల ప్రతి సమస్యను విని తక్షణ చర్యలు తీసుకుంటామని,త్వరితగతిన న్యాయం జరగేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. పారదర్శకతతో సేవలు అందించడం పోలీసు విభాగం ప్రధాన ధ్యేయమని పోలీసులకు సూచించారు. ఎస్పీ ప్రజావాణి లో 14 పిర్యాదులుఅందాయి.