calender_icon.png 30 September, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారం

30-09-2025 01:42:43 AM

భద్రాచలం, సెప్టెంబర్ 29,(విజయక్రాంతి)మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలనుండి గిరిజన దర్బార్ లో అర్జీలు సమర్పించడానికి వచ్చే గిరిజనుల నుండి వివిధ సమస్యల గురించి వచ్చిన దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు.

సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్ లో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అధికారిక పనులపై వెళ్లి అందుబాటులో లేనందున వివిధ సమస్యల గురించి విన్నవించడానికి వచ్చిన గిరిజనుల నుండి తన ఛాంబర్ లో యూనిట్ అధికారుల సమక్షంలో ఆయన అర్జీలు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల మోడల్ కోడ్ ఉన్నందున గిరిజనుల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను మాత్రమే స్వీకరించడం జరిగిందని అన్నారు.

ఈరోజు గిరిజన దర్బార్ కు ఎక్కువ శాతం గిరిజనులు పోడు భూముల పట్టాల కొరకు, గిరి వికాసం ద్వారా సబ్సిడీపై కరెంటు, బోరు, మోటార్ల కొరకు, పోడు భూముల పట్టాలు ఆన్లైన్ చేయించుట కొరకు, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక వెసులుబాటు కల్పించుట కొరకు,

అలాగే భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ,గిరిజన గ్రామాలలో వ్యవసాయం చేసుకోవడానికి బోరు, మోటార్లు ఇప్పించుట కొరకు, మారుమూల ప్రాంత గిరిజన గ్రామాలకు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం, కరెంటు ఇప్పించుట కొరకు, సోలార్ విద్యుత్ సరఫరా ఇప్పించుట కొరకు, నూతనంగా మత్య సొసైటీలు ఏర్పాటు కొరకు, వితంతు, ఒంటరి మహిళ, ఆసరా పెన్షన్లు ఇప్పించుట కొరకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత శిక్షణలు ఇప్పించుట కొరకు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం అందించుట కొరకు,

గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ప్రత్యేకమైన రిజిస్టర్లో మరియు ఆన్లైన్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎలక్షన్ మోడల్ కోడ్ అమలులోకి వచ్చినందున వివిధ సమస్యల గురించి అర్జీలు పెట్టిన గిరిజనుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల మోడల్ కోడ్ ముగియగానే వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు,ఏపీఓ పవర్ వేణు, ఏడిఎంహెచ్వో సైదులు, కొండరెడ్ల విభాగం అధికారి రాజారావు, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.