calender_icon.png 30 July, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

29-07-2025 05:16:50 PM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పుష్పలత..

అనంతగిరి: ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అనంతగిరి యందు ఆరోగ్య సిబ్బంది, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందితో జరిగిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత సీజనల్ లో కీటక జనిత వ్యాధులు, కలుషిత నీరు, ఆహారం ద్వారా వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోద వ్యాధి, మెదడు వాపు గురించి, నీరు, కలుషిత ఆహారం ద్వారా వచ్చే టైపా యాడ్, కామెర్లు, నీళ్ళ విరేచనాల, బంక విరేచనాల, కలరా గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం ద్వారా అరికట్టవచ్చునని తెలిపారు.

సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాయనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎండి ఇస్సాకు హుస్సేన్, ఎంపీ ఓ పాండు రంగన్న ,ఆర్ డబ్ల్యుస్ ఏ ఈ నాగరాజు, వైద్య ఆరోగ్యశాఖ సూపర్వైజర్లు హెచ్ ఓ ఉపేందర్ పి హెచ్ ఎన్ అనంతలక్ష్మి సూపర్వైజర్ ఉమామహేశ్వరి, యాతాకులు మధుబాబు, పంచాయతీ కార్యదర్శులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.