calender_icon.png 30 July, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్యంపై చర్యలు చేపట్టాలి

29-07-2025 05:14:13 PM

ముస్తాబాద్ బిజెపి నాయకులు...

పంచాయతీ ఈవో రమేష్ కు వినతిపత్రం అందజేత..

ముస్తాబాద్ (విజయక్రాంతి): ముస్తాబాద్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ లో పారిశుద్ధం పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని గ్రామపంచాయతీ ఈవో రమేష్(Gram Panchayat EO Ramesh)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా క్రాంతి మాట్లాడుతూ, 15 సంవత్సరాల క్రితం మత్స్య శాఖ నుండి 10 లక్షలు, జెడ్పిటిసి నిధుల నుండి 10లక్షలు మార్కెట్ కోసం వెచ్చించి నిర్మించారు. కాని ఫిష్ మార్కెట్ షెడ్డు నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందన్నారు. శివ కేశవ ఆలయం వద్ద ఉన్న నీళ్ల ట్యాంకును ఉపయోగంలోకి తేవాలన్నారు. అక్కడక్కడ నీళ్ల ట్యాంకులు నాచుతో పేరుకుపోయాయని వాటిని వెంటనే శుభ్రం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని పరిశుభ్రత చర్యలు చేపట్టాలన్నారు.

గత ప్రభుత్వం ముస్తాబాద్ పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పి ఎలాంటి అభివృద్ధి చేయకపోగా మురికి కాలువల నీరు చెరువులో చేరి కలుషితంగా మారుతుందన్నారు. చెరువు కింద ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిలో చిల్డ్రన్స్ పార్క్ నిర్మిస్తామని చెప్పిన గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. డంపింగ్ యార్డ్ నుండి వచ్చే పొగ కారణంగా ఎస్సీ కాలనీ వాసులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వెంటనే పరిష్కార మార్గం చూపాలని తెలిపారు. తాగు నీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించి గుంతలు తీసి వదిలేసిన వాటిని పూడ్చాలని వెల్లడించారు. ముస్తాబాద్ ను క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలని గ్రామపంచాయతీ ఈవో రమేష్ ను కోరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ,జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి,నాయకులు మహేందర్, శంకర్,శ్రీనివాస్ రావు, పద్మ,సత్యం,రమేష్,వెంకటేష్, సత్యం,శ్రీనివాస్,అనిల్, రమేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.