calender_icon.png 16 August, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి

14-08-2025 01:19:46 AM

  1. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు

రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు

వికారాబాద్, ఆగస్టు- 13( విజయ క్రాంతి)నిరంతర వర్షాల నేపథ్యంలో రానున్న మూడు రో జుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించినందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.

బుధవారం కలెక్టరేట్లోని ఎన్ ఐ సి కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అధికారులతో కలిసి భారీ వర్షాల వల్ల తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, వన మహోత్సవం, ఇందిరమ్మ ఇండ్లపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశము నిర్వహించారు.రానున్న మూడు రోజులు సెలవులు ఉన్నందున అనంతగిరి కి పర్యాటకులు ఎవ్వరు కూడా రాకుడదని, అనంతగిరి ట్రెక్కింగ్ ను మూసి వేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు.....

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ రెండు రోజులు ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు వెళ్లాలని, ఆగ స్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొనాలని సూచించింది.