calender_icon.png 16 August, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక డబ్బులు తీసుకుంటే అనుమతులు రద్దు

14-08-2025 01:18:09 AM

తాండూరు, 13, ఆగస్టు (విజయ క్రాంతి) ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ప్రజల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తే మీ సేవా కేంద్రం అనుమతులు రద్దు చేస్తామని వికారాబాద్ జిల్లా యాలాల తహసిల్దార్ వెంకట్ స్వామి అన్నారు.బుధవారం ఆయన మండల కేంద్రంలో ఉన్న మీసేవ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ మీసేవ కేంద్రంలో ఏవైనా సమస్యలు ఉంటే లేదా డబ్బులు అధికంగా తీసుకున్నట్టు తెలిస్తే తాసిల్దారు కార్యాలయం లో ఫిర్యాదు చేయాలని ఇచ్చిన డబ్బులకు సరిపడా రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.

స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉందా లేదా మరియు విద్యా బోధన ఎలా సాగుతుందని విద్యార్థులతో అ డిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భవనం శిథిలావస్థకు చేరితే గనుక గదులను మార్చాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు విద్యుత్ స్తంభాలు మరియు నదుల వద్దకు వెళ్లకూడదని అత్యవసరం ఉంటే తప్ప ఇంటి నుండి బయటికి రాకూడదని ప్రయాణాలు కూడా చేయరాదని . శిథి లావస్థకు చేరిన ఇళ్లల్లో నివసించరాదని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.