03-05-2025 02:50:14 AM
రాజేంద్రనగర్, మే 2: మహిళా సాధికారత కోసమే అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈవో జూలియా ఈవెలిన్ మోర్లి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 7 నుంచి 31 వరకు నిర్వహించనున్న 2025 మిస్ వరల్డ్ పోటీల పర్యవేక్షణ నిమిత్తం ఆమె శుక్రవారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు ఆమెకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.
అనంతరం మోర్లీ మీడియా తో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం హర్షనీయమన్నారు. ప్రపంచ ప్రేక్షకులకు తెలంగాణ రాష్ట్ర అద్భుత వారస త్వాన్ని చూపించడానికి ఈ పోటీలు ఉపయోగపడుతుందన్నారు. కాగా మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై పలు ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై సంబం ధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో మోర్లీ సమీక్ష నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో మొత్తం 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు.