calender_icon.png 6 May, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓంకార్ శతజయంతి వాల్ పోస్టర్ ఆవిష్కరణ

06-05-2025 01:15:44 AM

 గూడూరు. మే 5: (విజయ క్రాంతి): మే 17న మచ్చపూర్ లో జరిగే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యునుడు అమరజీవి కామ్రేడ్ ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభను విజయవంతం చేయాలని ఎం సిపిఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కంచ వెంకన్న జిల్లా సహాయ కార్యదర్శి నూకల ఉపేందర్ పిలుపునిచ్చారు.

సోమవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో అమరజీవి కామ్రేడ్ ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ బహిరంగ సభకు గోరేటి వెంకన్న, ఎమ్మెల్సీ ప్రజావాగ్గేయకారులు, కామ్రేడ్ మంగాత్రామ్ పాస్లా, ఆర్‌ఎంపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి( పంజాబ్ )కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఎం సి పి ఐ (యు) జాతీయ కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే ,కామ్రేడ్ జే వి చలపతిరావు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, కామ్రేడ్ జయరాజు ప్రజాకవి ,తదితర నాయకులు పాల్గొంటారని ఈ సభను విజయవంతం చేయాలని కోరినారు ఈనాటి కార్యక్రమంలో పార్టీ నాయకులు బందేలా వీరస్వామి, కటకంబుచ్చిరామయ్య, గుండ గాని సత్తయ్య, చంద్రయ్య, బి సత్యం, తదితరులు పాల్గొన్నారు.