06-05-2025 01:15:03 AM
నాగారం, మే 5: నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో భూ భారతి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సోమవారం అవగాహన కళాజాత సమావేశంలో రైతులను గ్రామస్తులను ఉద్దేశించి సాంస్కృతిక సారధి జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ రైతులను భూమిని విడదీయలేనిదే భూ భారతి చట్టం అని మాట్లాడినారు.
భూమి హక్కుల రికార్డులు భూ భారతి చట్టం అందరికీ అందుబాటులో ఉంటాయి ఎవరైనా భూ హక్కుల రికార్డు అసైన్ కాఫీ కావాలంటే భూ భారతిలో ఉన్న ఫారంలో పది రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఈ వెసులుబాటులు ఏవి ధరణి చట్టంలో లేవు ఇప్పుడు వచ్చిన భూ భారతి చట్టంలో పొందుపరచడం జరిగింది ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై కళారూపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి టీం సభ్యులు ఈర్ల సైదులు గడ్డం ఉదయ్ వెన్నెల నాగరాజు మాగి శంకర్ డప్పు ఉపేందర్ మేడిపల్లి వేణు మద్దిరాల మంజుల రాధ నెమ్మాది స్రవంతి పోతరాజు శిరీష ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు....