23-12-2025 02:38:54 AM
నిర్మల్, డిసెంబర్22(విజయక్రాంతి): తెలం గాణ డెంటల్ క్లినిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి డెంటల్ క్లినిక్ లీగ్ పోటీలు సోమవారం అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీలకు నిజామాబాద్ మం చిర్యాల్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్ మెదక్ హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి డెంట ల్ క్లినిక్ వైద్యులు తరలివచ్చి క్రికెట్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో మంచిరాల జుట్టు విజేతగా నిలవగా జట్టు సభ్యులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటరమణ, వైద్యులు సురేష్ కుమార్, మమత, సుభాష్ రావు తదితరులు పాల్గొన్నారు.