27-01-2026 01:42:31 AM
హైదరాబాద్, జనవరి 26: మణికొండ ప్రాంతంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మణికొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన బెల్టులు, టైలను పంపిణీ చేశారు.ఈ సేవా కార్యక్రమానికి అజయ్ కుమార్ స్వయంగా రూ.20,000 విరాళంగా అందించి, విద్యార్థులకు అవసరమైన బెల్టులు, టైలు కొనుగోలు చేయించారు.
గణతంత్ర దినోత్సవాన్ని కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలతో జరప డం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో మణికొండ బీఆర్ ఎస్ మహిళా అధ్యక్షురాలు పట్లోళ్ల రూపా రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొని అజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మం దికి స్ఫూర్తినివ్వాలని వారు ఆకాంక్షించారు.