calender_icon.png 27 January, 2026 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గుడ్‌విల్ @40 రిపబ్లిక్ డే వేడుకలు

27-01-2026 01:43:52 AM

హైదరాబాద్, జనవరి 26: గుడ్‌విల్ స్కూ ల్స్ తన 40 ఏళ్ల విద్యా ప్రయాణాన్ని గుడ్‌విల్@40 పేరుతో రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం లలిత కళా తోరణం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. గత నాలుగు దశాబ్దాల్లో భారతదేశం సాధించిన అభివృద్ధి ప్రయాణం, గుడ్‌విల్ స్కూల్స్ ఎదుగుదలను సమాంతరంగా ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం రూపొందిం చబడింది.ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రాతినిధ్యం వహించే సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ కార్యక్ర మాని కి ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ హాజరై, గుడ్‌విల్ స్కూల్స్ నలభై సం వత్సరాల సేవలను ప్రశంసిస్తూ, దేశ నిర్మాణంలో విలువలతో కూడిన విద్యా సంస్థల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ గుడ్‌విల్ స్కూల్స్ దేశ అభివృద్ధితో పాటు ఎదుగుతూ, సమాజానికి స్థిరమైన విద్యా ఆధారంగా నిలిచిందని అ న్నారు. యువ నాయకుడు ముఠా జయసిం హ ఈ వేడుకలు భారతీయ సాంస్కృతిక మూలాలను న్యూ ఇండియా దృష్టితో అనుసంధానించాయని, విద్యార్థుల్లో పెద్ద కలలు కనే ఆత్మవిశ్వాసాన్ని నింపాయని వ్యాఖ్యానించారు. ఐదవ దశాబ్దంలోకి అడుగుపెడు తున్న గుడ్‌విల్ స్కూల్స్, నాణ్యమైన, విలువలతో కూడిన మరియు భవిష్యత్కు సిద్ధం చే సే విద్యను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.