calender_icon.png 26 May, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైటెక్ సిటీలో బీస్పోక్ డెంటల్ స్మైల్స్

26-05-2025 01:06:50 AM

హాజరైన విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన బీస్పోక్ డెంటల్ స్మైల్స్ ఇంటర్నేషనల్ వింగ్స్ కొత్త బ్రాంచీని హైదరాబాద్ వేదికగా ప్రారంభించారు.

ఆదివారం హైటెక్ సిటీలోని గౌడ్స్ డెంటల్ ఆసుపత్రిలో జరిగిన బీస్పోక్ డెంటల్ స్మైల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరైన విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం బీస్పోక్ డెంటల్ స్మైల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

దేశంలోనే బెస్ట్ కాస్మెటిక్, ఇంప్లాట్ డెంటిస్ట్రీలో అత్యుత్తమ డెంటల్ సెంటర్‌గా పేరున్న బీస్పోక్ డెంటల్ స్మైల్స్ ఇంటర్నేషనల్ వింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం గొప్ప విషయమని గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది. ఇంట్రాఓరల్ స్కానర్లు, డిజిటల్ ఎక్స్ సీఏడీ డయాగ్నస్టిక్స్, సర్జికల్ ప్లానింగ్, ఇంప్లాంట్లు, సైనస్ లిఫ్ట్‌లు, గ్రాఫ్టింగ్, పెరియో కాస్మెటిక్ సర్జరీలు బీస్పోక్ డెంటల్ స్మైల్స్ ముఖ్యాంశాలుగా ఉన్నాయని వివరించారు. 

బీస్పోక్ డెంటల్ స్మైల్స్ అందించే సేవలు

కాస్మెటిక్ డెంటిస్ట్రీ, స్మైల్ మేకోవర్‌లు, డెంటల్ ఇంప్లాంట్స్, ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్, అలైనర్లు, ఇన్విజాలైన్, ఆర్థోడాంటిక్స్, పీడియాట్రిక్, అడ్వాన్స్‌డ్ సర్జికల్, ప్రివెంటివ్ అండ్ లేజర్ డెంటిస్ట్రీ.