18-10-2025 12:00:00 AM
పార్టీ కోసం కష్టపడ్డ వారికి అందరి ఏకాభిప్రాయంతో ఎన్నిక
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 17 (విజయక్రాంతి) ః భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర జిల్లా అధ్యక్షుల నియామకం పారదర్శకంగా జరుగుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ అస్సాం మాజీ మంత్రి శరత్ రౌత్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు జరిగిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమానికి పరిశీలకునిగా రౌత్ విచ్చేశారు. సమావేశానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి అధ్యక్షత వహించగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
జిల్లాలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సమావేశంలో పరిశీలప్పుడు రౌత్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి ఆలిండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే, రాహుల్ గాంధీలు బృహత్తరమైన కార్యక్రమాలను తీసుకున్నారని అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసి నాయకులను జిల్లా అధ్యక్ష పదవులకు పారదర్శకంగా నియమించాలని అందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని నియమించాలని ఆదేశించారని అన్నా రు. ఈ నేపథ్యంలోని తాము జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తల నాయకుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నుండి ఆరుగురు పేర్లను పరిశీలించి అధిష్టానానికి పంపించిన అనంతరం ఒక్కరిని పార్టీ నియమిస్తుందని పరిశీలకులు స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్ష పదవి కావాలనుకునేవారు అన్ని విధాలుగా పార్టీని బలోపేతం చేసి అందర్నీ కలుపుకునే విధంగా ఉన్నవారు గ్రూప్లకు అతీతంగా పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. అధ్యక్ష ఎన్నిక విషయంలో ఎవరి ఒత్తిళ్లు రాజకీయాలు ఉండవని శరత్ స్పష్టం చేశారు. విప్పు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామకంలో ఎవరి ప్రమేయం ఉండదని దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను అధిష్టానం అబ్జర్వర్లు పరిశీలించి సరైన వ్యక్తిని నియమిస్తారని తెలిపా రు.
రెండేళ్ల పాలనలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో ప్రచారం చేసి రానున్న స్థానిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని సీట్లను కైవసం చేసుకోవడానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మా ట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా సరైన వ్యక్తిని పార్టీ నియమిస్తుంది అని అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని అప్పలపాలు చేసింది అని ఆరోపించారు.
లక్ష కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి కూల్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్ప డ్డ అనంతరం రెండేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ప్రజల్లోకి తీసుకువెళ్లి స్థానిక ఎన్నికల్లో విజయ డంకా ఉపయోగించాలని అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం అనేకమంది అబ్జర్వర్కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజి చిస్తీ, మార్కెట్ కమిటీ చైర్మన్ బాబురావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రమోద్ కుమార్, టిపిసిసి డెలిగేట్ మాజీ నెంబర్ తంగేళ్లపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ పోతం శెట్టి వెంకటేశ్వర్లు, సేవాదళ్ రాష్ట్ర నాయకులు పిట్టల బాలరాజు, వివిధ మండలాల పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.