calender_icon.png 9 January, 2026 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు

08-01-2026 12:22:13 AM

సైబర్ నేరాల పట్ల విద్యార్థి దశ నుండే చైతన్యం అవసరం

ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదివితేనే విజయాలు సాధ్యమవుతాయి

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే  

రాజన్న సిరిసిల్ల, జనవరి7 (విజయ క్రాంతి): వైద్య శిబిరానికి విద్యార్థుల నుండి విశేష స్పందన లభించగా,పెద్ద సంఖ్యలో విద్యార్థులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఆరోగ్య సమస్యలపై వైద్య నిపుణులు విద్యార్థులకు పలు సూచనలు చేయడం జరిగింది. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు. చిన్న వయస్సులోనే ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం,  ఎంతో అవసరమని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని క్రమశిక్షణతో కష్టపడి చదివితేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయని,చదువుతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ అలవర్చుకోవాలని హితవు పలికారు.

ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా మోసాలకు దూరంగా ఉండాలని,సైబర్ నేరగాళ్లు ప్రస్తుత సమాజంలో ఏఐ ఆధారిత వీడియో మెసేజ్ ల ద్వారా మోసం చేస్తున్నరని, వాటిపట్ల అప్రమత్తతో వ్యవహరించా లని సూచించారు. విద్యార్థులు సామజిక మాధ్యమాల్లో అపరిచి త వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత విషయాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకువద్దని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులలకు, ఉపాధ్యాయులు, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సైబర్ నేరాలకు మోసపోయిన వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి.కాల్ చేసి ఫిర్యాదులను చేయాలన్నారు.

సైబర్ నేరాలలో గోల్డెన్ హవర్ ముఖ్యమైనదని మోసపోయిన వెంటనే గ్రహించి ఫిర్యాదు చేసిన యెడల, మోసపోయిన డబ్బు ఎక్కువ శాతం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత కాలం లో విద్యార్థులను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు బ్లెడ్ సమస్య మరియు కంటి సమస్యలు.ఈ నేపథ్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో విద్యార్థులకు సాధారణ వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ యాజమాన్యంతో పాటు ఇందులో పాల్గొన్న వైద్య నిపుణులు, సురభి వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బంది, జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమంలో సి.ఐ మొగిలి, Meo రాజిరెడ్డి, ఎస్.ఐ గణేష్, డాక్టర్లు చంద్రశేఖర్ రావు, శ్రీకాంత్, అనురాధ, స్రవంతి పాల్గొన్నారు.