08-01-2026 12:20:59 AM
జూబ్లీహిల్స్, జనవరి 7 (విజయక్రాంతి) : డీవైఎఫ్‌ఐ జూబ్లీహిల్స్ జోన్ నూతన కమిటీ ఎన్నికను బోరబండలో నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ నాయకుడు కృష్ణ అధ్యక్షత న జూబ్లీహిల్స్ జోన్ మహాసభను బోరబండలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించా రు. ముఖ్య ఆహ్వానితులుగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్,జిల్లా కార్యదర్శి జావీద్ హాజరయ్యారు.వారి ఆధ్వర్యంలో ఎన్నికను నిర్వహించారు.ఈ ఎన్నికలో 11 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మనోజ్,కార్యదర్శిగా సునీల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారందరికీ నాయకులు శుభాకాంక్షలను తెలియజేశారు.