calender_icon.png 30 August, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరాఖండ్‌లో మేఘ గర్జన

30-08-2025 12:45:20 AM

  1. విరిగిపడ్డ కొండచరియలు
  2. ఎనిమిది మంది మృతి
  3. పలువురు గల్లంతు

డెహ్రాడూన్, ఆగస్టు 29: దైవ భూమి ఉత్తరాఖండ్‌లో మరోసారి వరణుడు తన ప్రతాపం చూపెట్టాడు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వరకు కురిసిన భారీ వర్షాల దెబ్బకు రాష్ట్రంలోని గర్వాల్, కుమోన్ ప్రాంతాల పరిధిలో ఎనిమిది మంది మృతి చెందారు. వరదల్లో పలువురు గల్లంతయ్యారు. ఇటీవలే ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. చమోలి, రుద్రప్రయాగ్, తేరీ, బాగేశ్వర్ జిల్లాల్లో ఇండ్లు వరదల ధాటికి కొ ట్టుకుపోయాయి.

మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ వరదల ధాటికి 35 పశువులు జలసమాధి అయ్యాయి. వర్షాల ధాటికి పలు చోట్ల కొండచరియలు విరిగిపడి ఇండ్లు, రోడ్లు ధ్వంసం అయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో రా ష్ట్ర వ్యాప్తంగా 180కి పైగా రోడ్లను మూసేశారు. హిమాలయన్ రాష్ట్రాల్లో తరచూ వరదలు సంభవిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.