13-09-2025 01:11:58 AM
భద్రాచలం, సెప్టెంబర్ 12, (విజయక్రాంతి) భారత రాష్ట్రపతి ఆదేశాల మేరకు గిరిజన అభివృద్ధి 2047 దృష్టి కోణంలో జరుగుతున్న పురోగతిని సమీక్షించేందుకు మరియు భవిష్యత్తు రోడ్డు మ్యాప్ ను రూ పొందించేందుకు వివిధ రాష్ట్రాల గిరిజన సంక్షేమ కార్యదర్శులు, ప్రాజెక్ట్ అధికారుల తో నిర్వహించిన మంత్రిత్వ శాఖ జాతీయ సదస్సులో పాల్గొనడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.
ఈ నెల 9, 10 తేదీలలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉన్న 19 మారుమూల మండలాలలోని 130 గ్రామాలలో ఆది కర్మయోగి అభియాన్, దర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్, పీఎం జన్మన్, అట zవీ హక్కుల చట్టం అమలు తీరుపై సదస్సులో వివరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరి జనులకు మరియు కొండరెడ్ల కుటుంబాలకు వారికి కావలసిన అన్ని రకాల సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్ని శాఖల అధికారుల సమక్షంలో వివిధ రకాల కార్డులు మరియు గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పూర్తి సమాచారం గ్రామసభలు ఏర్పాటు చేసి వి విధ శాఖల అధికారులతో అవగాహన క ల్పించడం జరిగిందని, ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద డిఎంటి శిక్షకులకు మ రియు బిఎంటి శిక్షలకు గ్రామాలలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి శిక్షణ అందిం చడం జరిగిందని అన్నారు.
అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాల రైతులకు పోడు పట్టాలు అందజేయడం జరిగిందని అలాగే ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ ప థకాలు గిరిజనులకు అందించి వారి జీవనోపాధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదలవుతున్న సంక్షే మ పథకాలు గిరిజనుల దరికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.అనంతరం గిరిజన మ్యూజియం నాకు సంబం ధించిన మ్యూజియం కాపీ బుక్ ను వీభూనాయర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కు అం దించి, భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియంలో ఆదివాసి గిరిజనులకు సంబంధించిన సాంస్కృ తి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వారి కట్టుబాట్లు గురించి వివరించారు.ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రిన్సిపాల్ సెక్రటరీలు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.