13-09-2025 01:10:20 AM
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య
మణుగూరు, సెప్టెంబర్ 12 (విజ యక్రాంతి) : భారత రాజకీయాలలో సీతా రాం ఏచూరి ప్రత్యేక ముద్ర వేసుకున్న రాజకీయ నాయకుడిగాను, ఉత్తమ పార్లమెంట రియన్ గాను పేరు పొందారని సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్ అన్నారు. శుక్రవారం పార్టీ కా ర్యాలయంలో సీతారాం ఏచూరి ప్రథమ వ ర్ధంతిని కోడిశాల రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి వారు పూ లమాల వేసి నివాళులర్పించారు.
అనంత రం మాట్లాడుతూ సీతారాం ఏచూరి ప్రపం చ, దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.ఇందిరాగాంధీ దే శంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జేఎన్టీయూలో విద్యార్థులను అందరిని కూడ కట్టి ప్రధాని ఇందిరా గాంధీ ఇంటికి వెళ్లి ఆమె చర్యలను ఎండగట్టిన ధైర్యశాలి ఏచూర అని కొనియాడారు. సమస్యల పైన, రాజకీయ అంశాల పైన ఆయన చేసిన ఉపన్యాసాలను ప్రతిపక్షాల తో పాటు అధికార పార్టీకూడా ప్రశంసించడంతో పాటు, ఉత్తమ పార్లమెంటేరియన్ గా మెప్పు పొందారన్నారు.
ప్రజల హక్కులను కాపాడటంలోనూ,ప్రజాస్వామ్య లౌకిక విధానాన్ని పరిరక్షించడం కోసం ప్రతిపక్షాలను ఏకం చేయడంలో సీతారాం ఏ చూరి ప్రధాన భూమిక పోషించారన్నారు. ఫాసిస్టు మతోన్మాద చర్యలకు నిక్కచ్చిగా మాట్లాడిన ఆయన విధానాన్ని రాబోయే కా లంలో వామపక్ష, ప్రజాతంత్ర వాదులు ముందుకు తీసుకెళ్ళాలన్నారు. బీజేపీ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, హిందూ మ తోన్మాద చర్యలను ఎండగట్టాలని అప్పుడే ఆయనకు పార్టీ శ్రేణులు ఇచ్చే నిజమైన నివాళి అని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు, నాయకులు నెల్లూరు నాగేశ్వరరావు,గద్దల శ్రీనివాస్, పిట్టల నాగమణి,కుంజా రాజు, కొండ్రు గౌరీ,నైనారపు నాగేశ్వర రావు, సత్యవతి, కోటయ్య,గుండి మల్లేష్,సుదర్శన్ పాల్గొన్నారు.