calender_icon.png 13 September, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మో.. ఆసుపత్రి!

13-09-2025 01:13:44 AM

  1. దగ్గు జలుబైనా అరక్ష అర్పించాల్సిందే
  2. రోగి అనుమానమే టెస్టుల పెంపునకు కారణం
  3. ఒక్కో టెస్ట్ పేరుతో భారీగా వసూళ్లు
  4. బెడ్ చార్జీలు మందుల పేరుతో అడ్డగోలు దోపిడీ
  5. రోగం ఒకటైతే వైద్యం మరోదానికి
  6. అత్యవసర సేవలు సైతం కిందిస్థాయి సిబ్బందితో ట్రీట్మెంట్
  7. సామాన్యులు మధ్యతరగతి వారిని సైతం కనికరించని వైనం

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ పట్టణంలోని కొల్లా పూర్ చౌరస్తాలో గల ఓ ప్రైవేటు ఆసుపత్రి రోగుల నుండి అడ్డగోలుగా దోచుకుంటుందని విమర్శలు పెరుగుతున్నాయి. రోగం ఒ కటైతే మరొక రోగానికి వైద్యం చేస్తూ రోజుల తరబడి టెస్టుల మీద టెస్టులు రాస్తూ డ బ్బులు పొందుతూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. వరుస గా కురుస్తున్న ముసురు వర్షాలతో వాతావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా ప్రతి ఇంట ఒకరు, ముగ్గురికి మించి వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు.

పట్టణాలు, గ్రా మాలల్లో లోపుస్తున్న పారిశుధ్య కారణంగా ప్రభలుతున్న దగ్గు, జలుబు ఒళ్ళు నొప్పుల వంటి జ్వరంతో బాధపడే వారి సంఖ్య భారీగా పెరిగింది. గ్రామీణ ప్రాంత ఆరోగ్య కేంద్రాలు, సిహెచ్ సి కేంద్రాల్లో సరైన వైద్యం పొందలేని వారు ప్రాణ ప్రీతి, అత్యవసర సమయాల్లో ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ వంటి ప్రాంతాల గ్రామీణ ప్రజలు జిల్లా కేంద్రానికి రావాలంటే ముందుగా కొల్లాపూర్ చౌరస్తా మీదుగా మరో ఐదు కిలోమీటర్లు ప్రయా ణం చేయాల్సి ఉంది.

దీంతో అక్కడే ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దగ్గు జలుబు సాధారణ జ్వ రం బారిన పడిన రోగులతో పాటు రోడ్డు ప్ర మాదాలు పాయిజన్ కేసులు, చాతినొప్పి ఇతర అత్యవసర సేవల కొరకు ప్రాణాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అక్కడే ఉన్న ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన సదరు ఆసుపత్రి యాజమాన్యం కార్పొరేట్ స్థాయిలో వసతు లు కల్పిస్తున్నామన్న పేరుతో అందిన కాడికి రోగుల నుండి ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నట్లు రోగులు మండిపడుతున్నారు.

అవస రం లేకపోయినా టెస్టులు పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు విని పిస్తున్నాయి. దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు వంటి అవుట్ పేషెంట్లు సైతం సుమారు పదివేలకు మించి సమర్పించాల్సిన పరిస్థితి దాపురించిందని రోగులు విచా రం వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేని మందులను సైతం బలవంతంగా అంటగడుతున్నారని వాపోతున్నారు. అత్యవసర రోడ్డు ప్రమాదాలు, ఇతర గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సరైన రోగం నిర్ధార ణ కాకముందే అదృష్టాన్ని పరీక్షించుకునేలా పూటకొక రోగం పేరు చెప్పి వైద్యం చేస్తూ అడ్డగోలు టెస్టులు రాసి వారి నుండి అంది న కాడికి దండుకుంటున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఓ రోగి లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా మూడు రోజులపాటు కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స చేసి వారి నుండి 50 వేలకు పైగా దండుకున్నారని రోగి బంధువులు ఆరోపించారు. 

స్పెషలిస్టుల పేరుతో అర్హత లేని వైద్యుల చేత వైద్యం.!

24 గంటలు అత్యవసర సేవలు అందిస్తామని పలు రకాల స్పెషలిస్టుల పేర్లతో రంగు రంగుల కరపత్రాలు ఫ్లెక్సీలు బోర్డులు బ్యానర్లు వేస్తూ ప్రచారం చేసుకున్న సదరు ఆసుపత్రి యాజమాన్యం మాత్రం రాత్రి 8 గంటలు దాటిందంటే అర్హత లేని వైద్యులచే వైద్యం అందిస్తున్నారని ప్రచారంలో ఉంది. న్యూరో, ఎముకల వైద్య నిపుణులు, చిన్న పిల్లల వైద్య నిపుణులు, జనరల్ సర్జరీ, రేడియాలాజిస్ట్ వంటి అన్ని రకాల స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటారని ప్రచా రం చేసుకున్నారు.

కానీ వారి కిందిస్థాయి సిబ్బంది చేత స్థాయికి మించిన వైద్యం చేయిస్తూ డబ్బులు మాత్రం బరాబర్గా వ సూలు చేయడం పట్ల రోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అర్హతలేని కిందిస్థాయి సిబ్బంది చేత స్థాయికి మించిన వైద్యం చే స్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు బాహాటంగా వ్యక్తమ వుతున్నాయి. రోగి ప్రాణాలు కోల్పోయిన వెంటనే యాజమాన్యం తన పరపతి పలుకుబడితో రోగి బంధువులను సైతం బెది రింపులకు గురి చేస్తూ రోగి ప్రాణానికి లెక్క కట్టి పంపిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఆస్పత్రులపై జిల్లా అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే పేట్రేగిపోతున్నాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

దోపిడీని సహించేది లేదు.!

రోగి అవసరాలను ఆసరాగా చేసుకొని అవసరంలేని టెస్టులు రాసి వారి నుండి డబ్బులు గుంజితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులు అత్యంత మెరుగుపడ్డాయి వాటిని వినియోగించుకోవాలి. తనిఖీలను ముమ్మరం చేసి అలాంటి వాటి ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం. 

 రవి నాయక్, వైద్యాధికారి నాగర్ కర్నూల్ జిల్లా