calender_icon.png 18 January, 2026 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి ఆలయాన్ని విస్తరిస్తాం

18-01-2026 01:24:31 AM

శ్రీ రామనవమి రోజున సీఎం చేతుల మీదగా శంకుస్థాపన

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అశ్వారావుపేట, జనవరి 17 (విజయక్రాంతి): భద్రాచలం రామాలయ విస్తరణ పనులను శ్రీ రామనవమి రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన అశ్వారావుపేట మండలంలోని గం గారం సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో భద్రాద్రి రామాలయం అబివృద్ధి సాధ్య పడలేదన్నారు. సీఎం రేవంత్ ప్రభుత్వంలో భద్రాద్రి రామాలయం పునరుద్ధరణ పనులు చేపట్టామని తెలిపారు.

అగ్రికల్చర్ ఇరిగేషన్ ఇండస్ట్రీ టూరిజం రంగాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణ  చేయాలని టార్గెట్  పెట్టుకున్న ట్టు మంత్రి తుమ్మల తెలిపారు. కాలుష్యం లేకుండా భూ మాతను ఉంచేలా సేంద్రీయ వ్యవసాయం పై రైతులను ప్రోత్సహించాల న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు.