calender_icon.png 5 October, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి అర్బన్ బ్యాంకు 29వ వార్షికోత్సవం

05-10-2025 12:10:30 AM

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాం తి): భద్రాద్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 29వ వార్షికోత్సవం ఖమ్మం గాంధీచౌక్‌లో గల హెడ్‌ఆఫీసులో శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి కేక్ కట్ చేసి మాట్లాడుతూ.. బ్యాంకు 28 వసంతాలు పూర్తి చేసుకొని 29 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, వాటాదారులకు, సిబ్బందికి, తనతో కలిసి పనిచేసిన పూర్వ, ప్రస్తుత డైరెక్టర్లకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలిపారు.

బ్యాంకు వివిధ రంగాల వారికీ రుణ సహాయంచేస్తూ సమాజంలో వారి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ సంవత్సరం మరో మరో 2 శాఖల విస్తరణతో మొత్తం బ్యాంకు శాఖలు ప్రస్తుతం వున్న 23 నుంచి 25కి పెరుగుతాయని తెలిపారు. ఖాతాదారులు తమ మీద వుంచిన విశ్వాసానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు త్వరలోనే రూ.1,000 కోట్లు టర్నోవర్ దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

బ్యాంకు సీఈఓ దాసరి వేణుగోపాల్ మాట్లాడుతూ.. బ్యాంకులో ఎన్‌పీఏ ఖాతాల వసూళ్లపై దృష్టి కేంద్రీకరించాలని, వచ్చే సంవత్సరం 30వ వార్షికోత్సవానికి 30 శాఖలతో విస్తరింపబడి వుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు డి రాజారావు, మద్దిపిచ్చయ్య, రాజపురోహిత్ చెన్‌సింగ్, రంగ నాగ శ్రీనివాసరావు, నర్మద, జయప్రద, బ్యాంకు ప్రథమ చైర్మన్ మధుసూదనరావు పాల్గొన్నారు.