calender_icon.png 29 September, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విప్లవ చైతన్యానికి మారుపేరు భగత్ సింగ్

29-09-2025 12:23:28 AM

సీపీఐ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి

మణుగూరు, సెప్టెంబర్ 28,(విజయక్రాంతి): చైతన్యానికి మారుపేరు భగత్ సింగ్ అని, సిపిఐ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్ అన్నారు.పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ ముష్కరులను ఎదిరించి,

తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అని కొనియాడారు. భగత్ సింగ్ త్యాగాన్ని నేటి యువత తప్పక ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. భగత్ సింగ్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని ట్యాంక్ బండ్ పై భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కుల రాజబాబు, అదెర్ల రాములు,కణితి సత్య నారాయణ, యనమల సుధాకర్, పాపయ్య, ప్రసాద్, రంజిత్, పాల్గొన్నారు.